Usoshi Sen Gupta: ప్రముఖ మోడల్ రోడ్డుపై వెళుతుంటే లైంగిక వేధింపులు!

  • గత రాత్రి కోల్ కతాలో ఘటన
  • స్నేహితురాలితో కలిసి క్యాబ్ లో వెళుతుండగా యాక్సిడెంట్
  • చుట్టుముట్టి వేధించిన బైకర్లు
పశ్చిమ బెంగాల్ కు చెందిన ప్రముఖ మోడల్ ఉషోషి సేన్ గుప్తా, తన స్నేహితురాలితో కలిసి ఇంటికి వెళుతున్న వేళ, కొందరు బైకర్లు ఆమెను లైంగికంగా వేధించారు. ఈ ఘటన గత రాత్రి 11.40 గంటల సమయంలో కోల్ కతాలో జరిగింది. ఓ మీడియా ఎంటర్ టెయిన్ మెంట్ సంస్థలో పనిచేస్తున్న ఉషోషి, ఉబర్ కారులో ఇంటికి వెళుతుండగా, ప్రమాదవశాత్తూ కారు ఓ బైక్ కు తగిలి అద్దం పగిలింది.

అంతే.. క్షణాల వ్యవధిలో పది మంది బైకర్లు వారి కారును చుట్టుముట్టారు. డ్రైవర్ ను వదిలేసి, ఆమెను వేధించారు. ఈ విషయాన్ని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. బైకర్లను గుర్తించి అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ కేసులో షేక్ రాహిత్, ఫర్దీన్ ఖాన్, షేక్ ఘని, షేక్ షబ్బీర్ అలీ, షేక్ వాసిం, షేక్ ఇమ్రాన్ అలీ, అతీఫ్ ఖాన్ లను నిందితులుగా గుర్తించి, వారిని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్టు తెలిపారు.
Usoshi Sen Gupta
Model
Bikers
Harrasment
Police

More Telugu News