Koteswaramma: 20 నుంచి 24 వరకూ విజయవాడ దుర్గ గుడిలో వరుణయాగం
- 20 - 22 వరకూ అర్చకుల పారాయణం
- 23న ఉదయం మండప ఆరాధనలు
- 24న ఉదయం సహస్ర ఘటాభిషేకం
వర్షాల కోసం ప్రజలు, ముఖ్యంగా రైతులు ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జూన్ రెండవ వారం నాటికి తెలుగు రాష్ట్రాలకు విస్తరించాల్సిన నైరుతి రుతుపవనాలు మూడో వారం ముగుస్తున్నా జాడ లేవు. ఈ నేపథ్యంలో వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని ఆకాంక్షిస్తూ విజయవాడలోని దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో వరుణ యాగం నిర్వహించనున్నట్టు ఈవో కోటేశ్వరమ్మ తెలిపారు.
యాగానికి సంబంధించిన వివరాలను ఆమె వెల్లడించారు. ఈ నెల 20 నుంచి 24 వరకూ నిర్వహించతలపెట్టిన వరుణయాగంలో 20 - 22 వరకూ ఉదయం 6 - 8 గంటల వరకూ దేవస్థానానికి చెందిన అర్చకులు పారాయణం నిర్వహించనున్నారు. 23న ఉదయం 7-11 గంటల వరకూ మండప ఆరాధనలుంటాయని, 24న ఉదయం 6-11 వరకూ సహస్ర ఘటాభిషేకం జరుగుతుందని కోటేశ్వరమ్మ తెలిపారు.