Australia: ఆసీన్‌ను భయపెట్టి ఓడిన బంగ్లాదేశ్.. ముస్తాఫికర్ సెంచరీ వృథా

  • దీటుగానే బదులిచ్చిన బంగ్లాదేశ్
  • గెలిచి అగ్రస్థానానికి ఎగబాకిన ఆస్ట్రేలియా
  • ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా డేవిడ్ వార్నర్

ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో నాటింగ్‌హామ్‌లో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 48 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ప్రత్యర్థులు నిర్దేశించిన భారీ విజయ లక్ష్యాలను అలవోకగా ఛేదిస్తున్న బంగ్లాదేశ్ ఈసారి బోల్తాపడింది. అయితే, 382 పరుగుల లక్ష్య చేధనలో 333 పరుగులు చేసి ప్రత్యర్థిని కాసేపు భయపెట్టింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు వార్నర్ వీర బాదుడుతో భారీ స్కోరు చేసింది. 147 బంతులు ఎదుర్కొన్న వార్నర్ 14 ఫోర్లు, 5 సిక్సర్లతో 166 పరుగులు చేశాడు. కెప్టెన్ ఫించ్ 53, ఉస్మాన్ ఖావాజా 89 పరుగులు చేశారు. చివరల్లో మ్యాక్స్‌వెల్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. 10 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 32 పరుగులు పిండుకున్నాడు. దీంతో ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 381 పరుగులు చేసింది.

అనంతరం భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 333 పరుగులు చేసి 48 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తమీమ్ ఇక్బాల్ 62, షకీబల్ హసన్ 41, మహ్మదుల్లా 69 పరుగులు చేశారు. ముస్తాఫికర్ రహీం (102) సెంచరీ చేసినా జట్టును మాత్రం ఓటమి కోరల్లోంచి రక్షించలేకపోయాడు. ఆసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ గెలుపుతో పది పాయింట్లతో ఆస్ట్రేలియా అగ్రస్థానికి చేరుకుంది.

  • Loading...

More Telugu News