Hyderabad: హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం
- తెలంగాణలోకి ప్రవేశించిన రుతుపవవాలు
- హయత్ నగర్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో వర్షం
- వచ్చే రెండు మూడ్రోజుల్లో విస్తరించనున్న రుతుపవనాలు
హైదరాబాద్ లో ఈరోజు సాయంత్రం పలు చోట్ల భారీ వర్షం కురిసింది. హయత్ నగర్, ఎల్బీనగర్, లక్డీకాపూల్, చార్మినార్, శాలిబండ, మొఘల్ పురా, అబిడ్స్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్,మాసబ్ ట్యాంక్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. కాగా, తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. వచ్చే రెండు మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా రుతుపవనాలు పూర్తిగా విస్తరిస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈసారి రుతుపవనాలు ఆలస్యంగా విస్తరించనున్నట్టు చెప్పారు. సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఆశిస్తున్నట్టు అధికారుల అంచనా. వచ్చే రెండు వారాల్లో సాధారణం కంటే మించి వర్షాలు కురుస్తాయని, ఈ వర్షాలు రైతులకు అనుకూలంగా ఉంటాయని అన్నారు.