Telugudesam: టీడీపీ రాజ్యసభాపక్ష నేతగా సీతారామలక్ష్మిని ఎంపిక చేశాం: గల్లా జయదేవ్
- టీడీపీ రాజ్యసభా పక్షం విలీనం రాజ్యాంగ విరుద్ధం
- నలుగురు ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలి
- వెంకయ్యనాయుడుని కలసిన గల్లా జయదేవ్
రాజ్యసభలో టీడీపీ పక్షం విలీనం చెల్లదంటూ పెద్దల సభ చైర్మన్ వెంకయ్యనాయుడుని టీడీపీ ఎంపీలు కలిసి ఓ లేఖ సమర్పించారు. అనంతరం, మీడియాతో గల్లా జయదేవ్ మాట్లాడుతూ, బీజేపీలో టీడీపీ రాజ్యసభా పక్షం విలీనం రాజ్యాంగ విరుద్ధమని, నలుగురు ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలని కోరామని అన్నారు. రాజ్యాంగం 10వ షెడ్యూల్ ప్రకారం రాజకీయ పార్టీల విలీనానికే అవకాశం ఉందని అన్నారు. పార్టీ మారిన టీడీపీ ఎంపీలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరామని చెప్పారు. టీడీపీ రాజ్యసభాపక్ష నేతగా సీతారామలక్ష్మిని ఎంపిక చేశామని, ఈ విషయాన్ని వెంకయ్యనాయుడికి చెప్పామని అన్నారు.