TTD: టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డిని నియమిస్తూ నోటిఫికేషన్ జారీ
- నియామక పత్రాలపై సంతకం చేసిన సీఎం జగన్
- ఉత్తర్వులు జారీచేసిన రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
- గత ట్రస్టు బోర్డు రద్దు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ట్రస్టు బోర్డు చైర్మన్ గా వైసీపీ అగ్రనేత వైవీ సుబ్బారెడ్డి నియమితులైన సంగతి తెలిసిందే. ఇవాళ ఉదయం నియామక పత్రాలపై సీఎం జగన్ సంతకం చేయగా, ఈ సాయంత్రం దానికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ అయింది. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ ఉత్తర్వులు జారీచేశారు. గత ట్రస్టు బోర్డును రద్దు చేస్తున్నట్టు తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గత బోర్డులో సభ్యులుగా ఉన్న సుధానారాయణమూర్తి, ప్రసాద్ బాబుల రాజీనామాలకు ఆమోదముద్ర వేశారు. వారితోపాటే రుద్రరాజు పద్మరాజు, పెద్దిరెడ్డి, డొక్కా జగన్నాథంల రాజీనామాలను సైతం ఆమోదించారు. కాగా, టీటీడీ నూతన చైర్మన్ గా వైవీ రేపు పదవీప్రమాణ స్వీకారం చేయనున్నారు. త్వరలోనే కొత్త పాలకమండలి నియామకం జరగనుంది.