India: ఆఫ్ఘనిస్థాన్ ముందు 225 పరుగుల లక్ష్యాన్నుంచిన టీమిండియా

  • ఆఫ్ఘన్ బౌలింగ్ కు తడబడిన టీమిండియా
  • కోహ్లీ, జాదవ్ అర్ధసెంచరీలు
  • ఆకట్టుకున్న ఆఫ్ఘన్ స్పిన్నర్లు

ఈ టోర్నీలో ఇప్పటివరకు ప్రభావం చూపని ఆఫ్ఘనిస్థాన్ బౌలర్లు భారత్ పై మాత్రం సమష్టిగా కదంతొక్కారు. హేమాహేమీలతో కూడిన టీమిండియాను 224 పరుగులకే కట్టడి చేశారు. ముఖ్యంగా రషీద్ ఖాన్, నబీ, రెహ్మాన్ లతో కూడిన ఆఫ్ఘన్ స్పిన్ త్రయం ఆకట్టుకుంది.  సౌతాంప్టన్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో కోహ్లీసేన టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ఆఫ్ఘన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 224 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ 67, కేదార్ జాదవ్ 52 పరుగులతో రాణించారు. ధోనీ (28), విజయ్ శంకర్ (29) ఫర్వాలేదనిపించారు. ఆఫ్ఘన్ బౌలర్లలో కెప్టెన్ నాయబ్, నబీ చెరో రెండు వికెట్లు తీశారు. రెహ్మాన్, రషీద్, షా, ఆలమ్ తలో వికెట్ దక్కించుకున్నారు.

  • Loading...

More Telugu News