Japan: జపాన్ రైల్వే వ్యవస్థను స్తంభింపజేసిన చిన్న కీటకం!
- ఒక్కసారిగా నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
- శ్రమించి కారణాన్ని తెలుసుకున్న అధికారులు
- చిన్న కీటకం విద్యుత్ తీగలోకి వెళ్లడంతో షార్ట్ సర్క్యూట్
- ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు
ఆలస్యమనే మాటే ఎరుగని జపాన్ రైల్వే వ్యవస్థను ఓ చిన్న కీటకం స్తంభింపజేసింది. దక్షిణ జపాన్‌లోని క్యూషూ రైల్వే కార్పొరేషన్ పరిధిలో మే 30న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక్కసారిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయి రైల్వే వ్యవస్థ మొత్తం నిలిచిపోయింది.
అధికారులు ఎంతో శ్రమించి చివరకు కారణాన్ని తెలుసుకోగలిగారు. రైల్వే ట్రాక్‌లకు సమీపంలోని ఓ విద్యుత్ బాక్స్‌లో నత్తను పోలి ఉండే చిన్న కీటకం విద్యుత్ తీగల మధ్యకు వెళ్లడంతో షార్ట్ సర్క్యూట్ సంభవించి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో రైళ్లన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అనంతరం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఈ కారణంగా దాదాపు 12 వేల మంది తమ గమ్య స్థానాలకు ఆలస్యంగా చేరుకున్నారు.