Viral Acharya: ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ రాజీనామా

  • 2017లో బాధ్యతలు స్వీకరించిన విరల్ ఆచార్య
  • పదవీ కాలానికి ఆరు నెలల ముందే రిజైన్
  • త్వరలోనే న్యూయార్క్ లో ప్రొఫెసర్ గా బాధ్యతలు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ విరల్ ఆచార్య, అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు. పదవీ విరమణ కాలానికి ఆరు నెలల ముందే ఆయన తప్పుకోవడం ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపింది. మూడు సంవత్సరాల పాటు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గా ఉండేలా 2017, జనవరి 23న ఆయన్ను కేంద్రం నియమించింది. సరిగ్గా మరో ఆరు నెలల్లో ఆయన పదవీ బాధ్యతలను వీడాల్సివుండగా, ఈ సమయంలో ఆయన రిజైన్ చేయడం గమనార్హం. తాను వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నానని తన రాజీనామా లేఖలో ఆయన వెల్లడించినట్టు తెలుస్తోంది. కాగా, ఆయన త్వరలోనే న్యూయార్క్ లోని స్టెర్న్ స్కూల్ లో ప్రొఫెసర్ గా బాధ్యతలను నిర్వర్తించనున్నారని సమాచారం.

  • Loading...

More Telugu News