SANGA REDDY: నేనూ టీపీసీసీ అధ్యక్ష పదవిని కోరుకుంటున్నా!: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి

  • ఉత్తమ్ ను ఇప్పుడే మార్చాల్సిన పనిలేదు
  • ఈ విషయమై కుంతియాతో మాట్లాడాను
  • మున్సిపల్ ఎన్నికలకు పార్టీ సిద్ధంగా ఉంది
తెలంగాణ పీసీసీ చీఫ్ కావాలని తాను కూడా కోరుకుంటున్నానని కాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. ప్రస్తుత పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఇప్పటికిప్పుడు మార్చాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడారు.

తాను పీసీసీ పదవిని కోరుకుంటున్న విషయాన్ని తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జి కుంతియాను కోరినట్లు చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ఎలా తీసుకురావాలన్న దానిపై తన దగ్గర ఓ మెడిసిన్ ఉందని వ్యాఖ్యానించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
SANGA REDDY
JAGGAREDDY
Congress
Telangana
TPCC
president
Uttam Kumar Reddy

More Telugu News