Nellore District: బోరు బావిలో పడ్డ ఇద్దరు చిన్నారులు.. శ్రమిస్తున్న సహాయక సిబ్బంది

  • పోలీసులకు సమాచారం అందించిన కుటుంబీకులు
  • బోరుబావికి సమాంతరంగా తవ్వకాలు
  • పది అడుగుల లోతులో చిన్నారులు

 చిన్నారులు ఆడుకుంటూ వెళ్లి బావిలో పడుతున్న ఘటనలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి. కొన్ని కొన్ని ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉన్న బోరు బావులు పూడ్చకపోవడం.. ప్రమాదవశాత్తు పిల్లలు ఆడుకుంటూ వెళ్లి పడిపోవడం లాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా.. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ఊటుకూరు పెదపాలెంలో ఇద్దరు చిన్నారులు బోరుబావిలో పడిపోయారు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు హుటాహుటిన పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది సహాయ చర్యలు ప్రారంభించారు.

ప్రస్తుతం జేసీబీతో బోరుబావికి సమాంతరంగా మట్టిని తవ్వుతున్నారు. అయితే ఇద్దరు చిన్నారులు పది అడుగుల లోతులో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఘటనాస్థలికి చేరుకుని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కాగా.. సహాయక చర్యలు సుమారు గంట నుంచి ప్రారంభమైనట్లు తెలుస్తోంది. మరోవైపు చిన్నారుల కుటుంబీకులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

  • Loading...

More Telugu News