Devineni Avinash: జగన్ నవరత్నాల్లో ఒకటి అప్పుడే రాలిపోయింది: దేవినేని అవినాశ్

  • ఎన్నికలకు ముందు వయోవృద్ధులకు రూ. 3 వేల పెన్షన్ అన్నారు
  • ఇప్పుడేమో రూ. 2,250 ఇస్తున్నారు
  • అమ్మఒడి విషయంలో ప్రజా వ్యతిరేకతను చూసి సర్దుకున్నారు
  • టీడీపీ కార్యకర్తల సమావేశంలో దేవినేని అవినాశ్

వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాల్లో ఓ రత్నం అప్పుడే రాలిపోయిందని టీడీపీ యువనేత దేవినేని అవినాశ్ వ్యాఖ్యానించారు. 22 రోజుల వ్యవధిలోనే జగన్ మాటతప్పారని అన్నారు. గుడ్లవల్లేరు మండల తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జరిగిన కార్యకర్తల సమావేశంలో అవినాష్‌ పాల్గొని మాట్లాడారు. ఎన్నికలకు ముందు వృద్ధులకు రూ. 3 వేల పెన్షన్ ఇస్తానని చెబుతూ, ఇప్పుడు దాన్ని రూ. 2,250కి కుదించారని ఆయన విమర్శలు గుప్పించారు. అమ్మఒడి విషయంలోనూ ప్రభుత్వం తడబడిందని, ఒకటి చెప్పి, మరొకటి చేయబోతే, ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతోనే సర్దుకున్నారని ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలంతా సిద్ధమై, ఘన విజయాన్ని అందించాలని పిలుపునిచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగుదేశం కార్యకర్తలపై దాడులు పెరిగాయని ఆరోపించిన అవినాశ్, ఒక చెంపపై కొడితే మరో చెంప చూపే రోజులు ఇప్పుడు లేవని, రెండు చెంపలనూ వాయించి చూపుతామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News