aap: ఆప్ ఎమ్మెల్యేకు జైలు శిక్షను విధించిన ఢిల్లీ కోర్టు

  • పోలింగ్ ప్రక్రియకు విఘాతం కల్పించారంటూ కేసు
  • మూడు నెలల జైలు శిక్ష విధించిన కోర్టు
  • రూ. 10 వేల బాండ్ పై బెయిల్ మంజూరు

ఆప్ ఎమ్మెల్యే మనోజ్ కుమార్ కు మూడు నెలల జైలు శిక్షను విధిస్తూ ఢిల్లీలోని ఓ కోర్టు తీర్పును వెలువరించింది. 2013 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కల్యాణ్ పూర్ ప్రాంతంలోని ఓ పోలింగ్ బూత్ లో పోలింగ్ ప్రక్రియకు విఘాతం కల్పించారనే కేసును విచారించిన కోర్టు... మూడు నెలల శిక్షను ఖరారు చేసింది. మరోవైపు, రూ. 10వేల బెయిల్ బాండ్ పై ఆయనకు బెయిల్ ను మంజూరు చేసింది. తమ తీర్పును ఉన్నత న్యాయస్థానాల్లో సవాలు చేసుకోవచ్చని సూచించింది.

ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందిని అడ్డుకున్నారనే అభియోగాలతో మనోజ్ కుమార్ పై ఐపీసీ సెక్షన్ 189 కింద కేసు నమోదైంది. దీనికి తోడు... పోలింగ్ స్టేషన్ వద్ద అలజడి సృష్టించారనే ఆరోపణలతో ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 131 కింద కూడా అభియోగాలు నమోదయ్యాయి.

  • Loading...

More Telugu News