sensex: స్టాక్ మార్కెట్ దూకుడు.. రెండు రోజుల నష్టాలకు బ్రేక్
- 312 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 97 పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ
- రెండున్నర శాతం పైగా పెరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్
దేశీయ స్టాక్ మార్కెట్లలో రెండు రోజుల వరుస నష్టాలకు ఈరోజు బ్రేక్ పడింది. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ముగిశాయి. ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్స్ రంగాల షేర్ల కొనుగోళ్ల అండతో మార్కెట్లు లాభాల్లో పయనించాయి. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐలాంటి దిగ్గజాలు మార్కెట్లను ముందుండి నడిపించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 312 పాయింట్లు లాభపడి 39,435కి పెరిగింది. నిఫ్టీ 97 పాయింట్లు పుంజుకుని 11,796కు చేరుకుంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
రిలయన్స్ ఇండస్ట్రీస్ (2.63%), ఎన్టీపీసీ (2.51%). యాక్సిస్ బ్యాంక్ (2.49%), టాటా స్టీల్ (2.36%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (1.31%).
టాప్ లూజర్స్:
యస్ బ్యాంక్ (-1.70%), ఏషియన్ పెయింట్స్ (-0.96%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.73%), టెక్ మహీంద్రా (-0.60%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.42%).