Jagan: అగ్రిగోల్డ్ బాధితులకు వెంటనే సాయం అందేలా చూడండి... అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

  • జిల్లా కలెక్టర్ల సమావేశంలో అగ్రిగోల్డ్ అంశంపై చర్చ
  • అగ్రిగోల్డ్ యాజమాన్యం ఆస్తుల స్వాధీనం వేగవంతం చేయాలంటూ ఆదేశాలు
  • జగన్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన అగ్రిగోల్డ్ ఖాతాదారుల సంఘం

అగ్రిగోల్డ్ బాధితుల కోసం ఏపీ సర్కారు రూ.1150 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నిధులను వీలైనంత త్వరగా అగ్రిగోల్డ్ బాధితులకు అందజేసేలా చర్యలు తీసుకోవాలంటూ సీఎం జగన్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, ఐపీఎస్ ల సమావేశం రెండరోజున జగన్ అగ్రిగోల్డ్ బాధితుల వ్యవహారాన్ని చర్చించారు.

బాధితులకు నిధుల పంపిణీతో పాటు అగ్రిగోల్డ్ కంపెనీకి చెందిన విలువైన ఆస్తులపైనా అధికారులు దృష్టి సారించాలని సూచించారు. అగ్రిగోల్డ్ యాజమాన్యానికి చెందిన ఆస్తుల స్వాధీనాన్ని వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. దీనిపై, అగ్రిగోల్డ్ ఖాతాదారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విశ్వనాథరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో 9 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు ఏకకాలంలో న్యాయం జరుగుతుందని తెలిపారు.

  • Loading...

More Telugu News