Vivek: చేనేత కార్మికులను పట్టించుకునే వ్యవస్థ కనబడట్లేదు: మాజీ ఎంపీ వివేక్
- పెన్షన్, డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించాలి
- మరణించిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలి
- తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి 350 మంది మృతి
చేనేత కార్మికులను పట్టించుకునే వ్యవస్థ కనపడడం లేదని తెలంగాణాకు చెందిన మాజీ ఎంపీ వివేక్ అన్నారు. నేడు తెలంగాణలో చేనేత కార్మికుల మరణాలను నిరసిస్తూ నేత కార్మికుల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా జరిగింది. ఈ ధర్నాకు వివేక్‌తో పాటు రాజ్యసభ సభ్యుడు రాజేష్, సీపీఐ, సీపీఎం నేతలు మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ, హెల్త్ కార్డులు, సబ్సిడీ, పెన్షన్, డబుల్ బెడ్ రూం ఇళ్లను చేనేతల కుటుంబాలకు ఇవ్వడం ద్వారా మరణించిన చేనేత కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకూ 350 మంది చేనేత కార్మికులు చనిపోయారని వివేక్ పేర్కొన్నారు.