secrateriat: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు హౌస్‌ అరెస్టు

  • సచివాలయం, అసెంబ్లీ నూతన భవనాల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న విపక్షాలు
  • నిరసనకు పిలుపు ఇవ్వడంతో ఈ నిర్ణయం
  • యథావిధిగా శంకుస్థాపన పూర్తిచేసిన సీఎం కేసీఆర్‌

నూతన సచివాలయం, అసెంబ్లీ భవనాలు నిర్మించాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న విపక్ష నేతలను అక్కడి పోలీసులు ఈరోజు హౌస్‌ అరెస్టు చేశారు. ఇందులో భాగంగా కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎంపీ వి.హనుమంతరావును ఆయన ఇంటిలోనే నిర్బంధించారు. హైదరాబాద్‌ నగరంలో ట్యాంక్‌ బండ్‌ను ఆనుకుని ఉన్న పాత సచివాలయం భవనం స్థానే రూ.400 కోట్లతో కొత్త భవనాలను, అలాగే ఎర్రమంజిల్‌లో రూ.వంద కోట్లతో అసెంబ్లీ భవనాన్ని నిర్మించాలని కేసీఆర్‌ ప్రభుత్వం నిర్ణయించింది.

ఈరోజు ఉదయం శంకుస్థాపనకు ముహూర్తంగా నిర్ణయించారు. అయితే ఇప్పటికే భవనాలు ఉండగా కొత్తవి నిర్మించి ప్రజాధనాన్ని కేసీఆర్‌ ప్రభుత్వం వృథా చేస్తోందని ఆరోపిస్తూ విపక్ష నాయకులు నిరసనకు పిలుపునిచ్చారు. దీంతో శంకుస్థాపన కార్యక్రమాన్ని వీరు అడ్డుకునే అవకాశం ఉందన్న ఉద్దేశంతో వీహెచ్‌తోపాటు పలువురు నేతలను పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. అదే సమయంలో సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన పూర్తి చేశారు.

  • Loading...

More Telugu News