India: వరల్డ్ కప్: విండీస్ పై టాస్ గెలిచిన టీమిండియా
- మాంచెస్టర్ లో మొదట బ్యాటింగ్ తీసుకున్న కోహ్లీ
- షమీని కొనసాగించాలని మేనేజ్ మెంట్ నిర్ణయం
- ఇద్దరు స్పిన్నర్లతో విండీస్ పనిబట్టాలని వ్యూహం
మాంచెస్టర్ లో వెస్టిండీస్ తో మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచింది. ఇక్కడి ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానంలో మొదట బ్యాటింగ్ చేయాలని కెప్టెన్ విరాట్ కోహ్లీ నిర్ణయించుకున్నాడు. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో లక్ష్యఛేదన ఏమంత లాభదాయకం కాదని నిరూపితమైన నేపథ్యంలో కోహ్లీ నిర్ణయం ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు.
కాగా, టీమిండియాలో భువీ ఫిట్ నెస్ సాధించినా యాజమాన్యం మాత్రం మహ్మద్ షమీవైపే మొగ్గుచూపింది. తుదిజట్టులో షమీకే స్థానం కల్పించారు. భువీకి కూడా స్థానం కల్పిస్తారని, భారత్ ముగ్గురు పేసర్లు, ఒక స్పిన్నర్ తో బరిలో దిగుతుందని మ్యాచ్ ముందు ప్రచారం జరిగినా, స్పిన్ ఆడడంలో విండీస్ తడబడుతుందన్న నేపథ్యంలో కోహ్లీ ఇద్దరు స్పెషలిస్టు స్పిన్నర్లకే ఓటేశాడు. దాంతో, చహల్, కుల్దీప్ యాదవ్ తమ స్థానాలు నిలుపుకున్నారు.