Vijay Shankar: మరోసారి నిరాశపరిచిన విజయ్ శంకర్

  • విండీస్ తో మ్యాచ్ లో 14 పరుగులకే అవుట్
  • నం.4 స్థానానికి న్యాయం చేయలేకపోతున్న తమిళనాడు ఆల్ రౌండర్
  • టీమిండియా స్కోరు 35 ఓవర్లలో 4 వికెట్లకు 166 రన్స్

వరల్డ్ కప్ ఆడే భారత జట్టులో అనూహ్యంగా చోటు దక్కించుకున్న తమిళనాడు ఆటగాడు విజయ్ శంకర్ తన ఎంపికకు న్యాయం చేయడంలో విఫలమవుతున్నాడు. ఇవాళ వెస్టిండీస్ తో మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ లీగ్ పోరులో విజయ్ శంకర్ కేవలం 14 పరుగులకే అవుటయ్యాడు. లోయర్ ఆర్డర్ లో వచ్చి స్వల్పస్కోరుకే వెనుదిరగడం ఎవరికీ ఆశ్చర్యం కలిగించదు కానీ, ఈ ఆల్ రౌండర్ ఎంతోకీలకమైన నం.4 స్థానంలో బ్యాటింగ్ కు దిగి పేలవంగా ఆడుతూ విమర్శలపాలవుతున్నాడు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 35 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 48 పరుగులు చేయగా, మరో ఓపెనర్ రోహిత్ శర్మ 18 పరుగులకే వెనుదిరిగాడు. ఎప్పట్లాగానే కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రీజులో పాతుకుపోవడమే కాకుండా అర్ధసెంచరీ సాధించి జట్టు భారీ స్కోరుకు బాటలు వేసే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే, కోహ్లీకి సహకారం అందించేవారు కరవయ్యారు. విజయ్ శంకర్, జాదవ్ (7) స్వల్పస్కోర్లకే పెవిలియన్ చేరగా, ప్రస్తుతం కోహ్లీ (66) జతగా ధోనీ (9) ఆడుతున్నాడు.

  • Loading...

More Telugu News