Bangladesh: బంగ్లాదేశ్ జాతీయుడ్ని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ... కర్ణాటకలో హైఅలర్ట్!

  • దొడ్డబళ్లాపుర పట్టణంలో అనుమానిత ఉగ్రవాది అరెస్ట్
  • సీఐడీ అధికారులతో సమావేశమైన హోంమంత్రి
  • కర్ణాటక వ్యాప్తంగా కలకలం

కర్ణాటకలోని దొడ్డబళ్లాపుర పట్టణంలో ఓ బంగ్లాదేశ్ జాతీయుడ్ని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. అతడ్ని ఉగ్రవాదిగా అనుమానిస్తున్నారు. ఈ సంఘటనతో కర్ణాటక వ్యాప్తంగా కలకలం రేగింది. అనుమానిత ఉగ్రవాది అరెస్ట్ నేపథ్యంలో కర్ణాటకలో హైఅలర్ట్ విధించినట్టు రాష్ట్ర హోంమంత్రి ఎంబీ పాటిల్ తెలిపారు. బంగ్లాదేశ్ జాతీయుడ్ని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకోవడంపై తాను సీఐడీ అధికారులతో సమావేశమయ్యానని పాటిల్ చెప్పారు.

కాగా, ఎన్ఐఏ అదుపులో ఉన్న టెర్రరిస్టు పేరు హబీబుర్ రెహ్మాన్ షేక్ అని, అతడు 2014 బర్ద్వాన్ బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు అని తెలుస్తోంది. రెహ్మాన్ ను బంగ్లాదేశ్ కు చెందిన జిహాదీ గ్రూపు జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ)కి చెందినవాడిగా గుర్తించారు. అతడి నుంచి రెండు బాంబులు కూడా స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News