Narendra Modi: మహాత్మాగాంధీ చెప్పిన ఆ మూడు కోతులు పుట్టింది ఇక్కడే: మోదీ

  • 17వ శతాబ్దంలో జపాన్‌లో పుట్టిన సందేశం
  • గాంధీ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి
  •  జపాన్ పర్యటనలో గుర్తు చేసిన మోదీ

మహాత్మాగాంధీ చెప్పిన మూడు కోతుల సందేశం ఎంత ప్రసిద్ధి చెందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘చెడు వినవద్దు.. చెడు కనవద్దు.. చెడు అనవద్దు’ అని సూచించే మూడు కోతుల గుర్తులతో ఉండే ఈ సందేశం నిజానికి జపాన్‌లో పుట్టింది. అయితే, ఈ విషయం చాలామందికి తెలియదు. గాంధీ కారణంగా ప్రపంచవ్యాప్తమైంది.  

జపాన్‌లో పర్యటిస్తున్న మోదీ కోబెలో ప్రవాస భారతీయులతో మాట్లాడుతూ మూడు కోతుల విషయాన్ని ప్రస్తావించారు. గాంధీ సందేశమైన మూడు కోతులు 17వ శతాబ్దంలో ఇక్కడే పుట్టాయని మోదీ చెప్పడంతో వేదిక ఒక్కసారిగా కరతాళ ధ్వనులతో మార్మోగింది. భారత్-జపాన్ దేశాలు రెండింటిలోనూ ఒకే రకమైన సంస్కృతీ సంప్రదాయాలు ఉన్నాయని పేర్కొన్నారు. భారత్‌లో ధ్యాన సాధన ఉందనీ, జపాన్‌లో దానిని ‘జెన్’ సాధనగా పిలుస్తారని మోదీ వివరించారు.  

  • Loading...

More Telugu News