Basit ali: పాక్ సెమీస్‌కు చేరకుండా భారత్ కుట్ర చేస్తోంది: పాక్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ

  • శ్రీలంక, బంగ్లాదేశ్ చేతుల్లో భారత్ ఓడిపోతుందట
  • ఆప్థానిస్థాన్‌తో పేలవంగా ఆడింది కూడా కుట్రలో భాగమేనట
  • 1992 ప్రపంచకప్‌లోనూ ఇలాగే జరిగిందన్న అలీ

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ ప్రపంచకప్‌లో పాక్ జట్టు సెమీస్ చేరకుండా భారత జట్టు కుట్ర చేస్తోందని ఆరోపించాడు. భారత్ తన తదుపరి మ్యాచ్‌లలో శ్రీలంక, బంగ్లాదేశ్ చేతుల్లో ఉద్దేశపూర్వకంగా ఓటమి పాలవడం ద్వారా పాకిస్థాన్‌కు సెమీస్ అవకాశాలను దెబ్బతీయాలని చూస్తోందన్నాడు.

ఆఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్‌లో భారత జట్టు కావాలనే పేలవంగా ఆడిందని, భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ ఓపెనర్ వార్నర్ చెత్త బ్యాటింగ్ కూడా కుట్రలో భాగమేనని బాసిత్ అలీ ఆరోపించాడు. 1992 ప్రపంచకప్‌లోనూ ఇలాగే జరిగిందని, సెమీస్‌ను తమ దేశంలోనే ఆడాలన్న ఉద్దేశంతో లీగ్ మ్యాచ్‌లో పాక్ చేతిలో న్యూజిలాండ్ కావాలనే ఓడిందని అన్నాడు. కాగా, మ్యాచ్ ఫిక్సింగ్‌లో చిక్కుకుని క్రికెట్ నుంచి రిటైరైన బాసిత్ అలీ నోటి నుంచి ఇలాంటి ఆరోపణలు రావడంపై క్రికెట్ ప్రపంచం విస్మయం వ్యక్తం చేస్తోది.  

  • Loading...

More Telugu News