icc world cup: ఒక్క 'భారత్- పాక్' మ్యాచ్‌నే 229 మిలియన్ల మంది చూశారట!
- పెరుగుతున్న వరల్డ్ కప్ ఫీవర్
- ఆసక్తి పెంచుతున్న మ్యాచ్‌లు
- వివరాలు వెల్లడించిన బార్క్
ఇంగ్లండ్ అండ్ వేల్స్లో జరుగుతున్న ప్రపంచకప్ మ్యాచ్‌ల లీగ్ దశ పూర్తి కాబోతోంది. ప్రారంభంతో పోలిస్తే క్రమంగా అభిమానుల్లో వరల్డ్ కప్ ఫీవర్ పెరుగుతోంది. తొలుత చప్పగా సాగిన మ్యాచ్‌లు తర్వాత ఉత్కంఠభరితంగా మారడంతో అభిమానులకు కావాల్సినంత మజా అందుతోంది. మాంచెస్టర్‌లో గురువారం భారత్-విండీస్ మధ్య జరిగిన మ్యాచ్ 34వది కాగా, తొలి 27 మ్యాచ్‌లను భారత్‌లో ఎంతమంది వీక్షించారన్న నివేదికను బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) వెల్లడించింది.
బార్క్ నివేదిక ప్రకారం.. ప్రపంచకప్‌లోని తొలి 27 మ్యాచ్‌లను భారత్‌లో 381 మిలియన్ల మంది వీక్షించారు. జూన్ 16న భారత్-పాక్ మధ్య జరిగిన హైటెన్షన్ మ్యాచ్‌ను భారత్‌లో 229 మిలియన్ల మంది చూశారట. భారత జట్టు ఆడిన తొలి నాలుగు మ్యాచ్‌లను చూసిన వారి సంఖ్య 321 మిలియన్లుగా బార్క్ పేర్కొంది.