kaleswaram: గోదావరి ఉద్ధృతి.. కాళేశ్వరం వద్ద తెగిన అడ్డుకట్ట!
- పంపుహౌస్ అప్రోచ్ కాలువ వద్ద తెగిన అడ్డుకట్ట
- దిగువకు వెళ్లిపోతున్న నీరు
- ఇటీవలే ఆరో పంపుహౌస్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం సమీపంలో గోదావరి ప్రవాహానికి వేసిన అడ్డుకట్ట ఒకటి తెగింది. పంపుహౌస్ అప్రోచ్ కాలువ వద్ద అడ్డుకట్ట తెగిపోవడంతో వరద నీరు దిగువకు వెళ్లిపోతోంది. మహారాష్ట్రలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు ప్రాణహితలో కొద్దికొద్దిగా వరద నీరు పెరుగుతుండడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
కన్నేపల్లి పంపుహౌస్ గొట్టాలకు వెట్‌రన్ నిర్వహించేందుకు వీలుగా గత నెలలో గోదావరి, ప్రాణహిత నదుల ప్రవాహానికి అడ్డుకట్ట వేశారు. దీనివల్ల గోదావరి జలాలు అప్రోచ్ కాలువ, హెడ్ రెగ్యులేటర్ మీదుగా ఫోర్ బే దాటుకుని పంపుహౌస్ వద్దకు వెళ్తున్నాయి. ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడి ఆరో పంపును స్విచ్చాన్ చేసి ప్రారంభించగా కిలోమీటరు దూరంలో ఉన్న గ్రావెటీ కాలువలోకి పైపు ద్వారా నీరు వెళ్లింది.