Pregnent Woman: అపస్మారక స్థితిలో గర్భిణి.. బైక్ పై ఆసుపత్రికి తరలింపు!
- అంబులెన్స్ కోసం యత్నించిన గంజు
- లతేహర్ సదార్ ఆసుపత్రికి తరలించాలని సూచన
- అంబులెన్స్ దొరక్కపోవడం దారుణమన్న వైద్యుడు
- విచారణకు ఆదేశించిన ఎస్‌పీ శర్మ
ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ గర్భిణిని ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్ లభించకపోవడంతో ద్విచక్రవాహనంపైనే తరలించాల్సిన దుస్థితి ఏర్పడింది. జార్ఖండ్‌లోని చత్వాగ్ గ్రామానికి శాంతిదేవి అనే గర్భిణికి రక్తస్రావమై, అపస్మాకర స్థితిలోకి చేరుకోవడంతో ఆమె భర్త కమల్ గంజు సమీపంలోని చండ్వా పీహెచ్‌సీకి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ కోసం ప్రయత్నించాడు. కానీ ఫలితం దక్కలేదు. విషయం తెలుసుకున్న లతేహర్ డిప్యూటీ కమిషనర్ యత్నించినప్పటికీ అంబులెన్స్ లభించలేదు. దీంతో కమల్ గంజు తన భార్యను ద్విచక్ర వాహనంపైనే ఆసుపత్రికి తరలించాడు.
శాంతిదేవిని పరీక్షించిన వైద్యులు లతేహర్ సదార్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించడంతో అక్కడకు కూడా ద్విచక్ర వాహనంపైనే తరలించాల్సి వచ్చింది. లతేహర్ వైద్యులు రాంచీలోని రిమ్స్‌కు తరలించాలని సూచించడంతో అక్కడకు తరలించారు. ప్రస్తుతం శాంతిదేవిి రిమ్స్‌లో చికిత్స పొందుతోంది. ఈ విషయమై స్పందించిన లతేహర్ ఆసుపత్రి వైద్యుడు ఎస్‌పీ శర్మ మాట్లాడుతూ, శాంతిదేవికి అంబులెన్స్ ఏర్పాటు చేయకపోవడం దారుణమని, దీనిపై విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. గర్భిణీల కోసం 108 వాహనంతో పాటు మమత వాహనం కూడా అందుబాటులో ఉందన్నారు.