Andhra Pradesh: ఏపీలో పదో తరగతి పరీక్షల్లో ఇంటర్నల్ మార్కుల ఎత్తివేత
- గత సీజన్ వరకు టెన్త్ క్లాస్ లో 20 శాతం ఇంటర్నల్ మార్కులు
- ప్రయివేటు విద్యాసంస్థలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం నిర్ణయం
- ఈ విద్యా సంవత్సరం నుంచి 6 సబ్జెక్టుల్లో 11 పేపర్లు
ఏపీ విద్యావ్యవస్థలో మరో మార్పు చోటుచేసుకుంది. ఇప్పటివరకు అమల్లో ఉన్న టెన్త్ క్లాస్ ఇంటర్నల్ మార్కులను ప్రభుత్వం ఎత్తివేసింది. గత సీజన్ వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో 20 శాతం ఇంటర్నల్ మార్కులు ఉండేవి. ప్రయివేటు విద్యాసంస్థలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విద్యా సంవత్సరం నుంచి 6 సబ్జెక్టుల్లో 11 పేపర్ల మేరకు పరీక్షలు నిర్వహిస్తారు.