Narendra Modi: ఇండోనేషియా, బ్రెజిల్ అధ్యక్షులతో మోదీ వేర్వేరుగా సమావేశం.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ

  • జీ20 సదస్సు కోసం జపాన్‌ వెళ్లిన మోదీ
  • ఇండోనేషియా, బ్రెజిల్‌తో స్నేహ సంబంధాల బలోపేతంపై చర్చలు
  • చర్చలు ఫలవంతమయ్యాయన్న రవీశ్ కుమార్

జీ20 ఒసాకా సదస్సులో పాల్గొనేందుకు జపాన్ చేరుకున్న భారత ప్రధాని నరేంద్రమోదీ శనివారం ఇండోనేషియా, బ్రెజిల్ అధ్యక్షులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలపై చర్చించారు.

 ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోతో తొలుత సమావేశమైన మోదీ రెండు దేశాల మధ్య స్నేహ బంధాన్ని మరింత పటిష్టం చేసుకోవడం, వాణిజ్యం విషయంలో పరస్పర సహకారం, పెట్టుబడులు, రక్షణ, నేవీ రంగాల బలోపేతం తదితర వాటిపై చర్చించినట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ ట్వీట్ చేశారు. చర్చలు ఫలప్రదమైనట్టు పేర్కొన్నారు.

జోకోతో చర్చలు ముగిసిన అనంతరం బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సోనారోతో మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వ్యూహాత్మక భాగస్వామ్యం, ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడులు, వ్యవసాయం, జీవ ఇంధనం, వాతావరణ మార్పులు తదితర వాటిపై చర్చించారు.

  • Loading...

More Telugu News