YSRCP: మద్యం ద్వారా వచ్చే ఆదాయం మా ప్రభుత్వానికి అవసరంలేదు: ఏపీ మంత్రి నారాయణస్వామి

  • మద్యాన్ని ఓ ఆదాయవనరుగా చూడడంలేదు
  • ప్రభుత్వానికి ప్రజాసంక్షేమమే ముఖ్యం
  • తొలి దశలో బెల్టు షాపులు ఎత్తేస్తాం

మద్యపానానికి బానిసలైన భర్తలను పోగొట్టుకుని రాష్ట్రంలో ఎందరో మహిళలు వితంతువులుగా మిగిలిపోతున్నారని, అందుకే నవరత్నాల్లో భాగంగా హామీ ఇచ్చిన మద్య నిషేధానికి కట్టుబడి ఉన్నామని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి స్పష్టం చేశారు. మద్యం ద్వారా వచ్చే ఆదాయం తమ ప్రభుత్వానికి అవసరంలేదని, అసలు, మద్యాన్ని తమ ప్రభుత్వం ఓ ఆదాయ వనరుగానే చూడడంలేదని అన్నారు.

మద్య నిషేధాన్ని పలు అంచెల్లో అమలు చేస్తామని, తొలి దశలో బెల్టు షాపులు పూర్తిగా ఎత్తివేసి, ఆ దుకాణదారులకు ఇతర రంగాల్లో ఉపాధి అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రజల సంక్షేమమే తమ సర్కారుకు ముఖ్యమని చాటిచెప్పారు. తిరుపతిలో ట్రయినింగ్ పూర్తిచేసుకున్న ఎక్సైజ్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పెరేడ్ లో మంత్రి నారాయణస్వామి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News