Kalyana Lakshmi: దివ్యాంగులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ఆర్థిక సాయం పెంపు
- రూ.1,00,116 ఆర్థిక సాయాన్ని అందిస్తున్న ప్రభుత్వం
- కేంద్ర చట్టానికి లోబడి ఆర్థిక సాయం పెంపు
- దివ్యాంగులకు ఇక నుంచి రూ.1,25,145 ఆర్థిక సాయం
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన పేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లల వివాహం కోసం ఆర్థిక సాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద రూ.1,00,116 ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తూ వస్తోంది.
ఈ క్రమంలో, కేంద్ర చట్టానికి లోబడి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ఆర్థిక సాయాన్ని పెంచుతూ నేడు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఆర్థిక సాయం అందరికీ వర్తించదు. దివ్యాంగులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ పథకం కింద దివ్యాంగ పెళ్లి కుమార్తెల తల్లిదండ్రులకు ఇక నుంచి రూ.1,25,145 ఆర్థిక సాయం అందనుంది.