Dubai: భారత అమ్మాయిలను దుబాయ్ తీసుకెళ్లి బార్ డ్యాన్సర్లుగా చేసిన బ్రోకర్లు... స్పందించిన ఫారిన్ మినిస్ట్రీ!

  • ఈవెంట్‌ మేనేజ్‌ మెంట్‌ కంపెనీలో ఉద్యోగమని మోసం
  • బంధించి బార్లలో బలవంతపు నృత్యాలు
  • ఇండియాకు రప్పించిన విదేశాంగ శాఖ

ఈవెంట్‌ మేనేజ్‌ మెంట్‌ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తామని తమిళనాడుకు చెందిన నలుగురు అమ్మాయిలకు చెప్పిన బ్రోకర్లు, వారిని దుబాయ్ కి తీసుకెళ్లి, బార్ లో డ్యాన్సర్లుగా మార్చగా, వారిని చెరనుంచి రక్షించింది భారత విదేశాంగ శాఖ. మరిన్ని వివరాల్లోకి వెళితే, కోయం బత్తూరుకు చెందిన 20 ఏళ్ల వయసున్న అమ్మాయిలను ఓ ఈవెంట్‌ మేనేజ్‌ మెంట్‌ లో ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి దుబాయ్ కి తరలించారు. అక్కడ వీరిని బంధించి, బలవంతంగా వారితో బార్‌ లో డ్యాన్స్ లు చేయించడం ప్రారంభించారు.

వారిలోని ఓ యువతి, వాట్స్ యాప్ ద్వారా తాము పడుతున్న కష్టాన్ని కుటుంబ సభ్యులకు చేరవేసింది. దీంతో వారు హుటాహుటిన ఫారిన్ మినిస్ట్రీని స్పందించగా, భారత అధికారులు దుబాయ్ పోలీసులకు విషయాన్ని చేరవేసి ఒత్తిడి పెంచారు. దీంతో పోలీసులు వారిని ట్రేస్ చేసి, రక్షించి, విమానంలో కొజికోడ్‌ కు పంపారు. ఈ విషయాన్ని భారత కాన్సుల్‌ జనరల్‌ విపుల్‌ మీడియాకు తెలిపారు. వారిని దుబాయ్ కి పంపిన ఏజెంట్లపై చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వానికి లేఖ రాయనున్నామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News