karimnagar: రోగ నిర్థారణ పరీక్ష ఏదైనా రూపాయే...కరీంనగర్ మేయర్ వినూత్న పథకం
- నిరుపేదలకు వైద్యసాయం
- ప్రయోగశాల, పరికరాలు కొనుగోలుకు రూ.25 లక్షల వ్యయం
- కేటీఆర్ సూచన మేరకు కొత్త పథకం ప్రకటన
తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ మేయర్ వినూత్న పథకాలతో దూసుకుపోతున్నారు. ఎటువంటి రోగ నిర్థారణ పరీక్షలైనా రూపాయికే చేయాలని తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే పేదవారి కోసం రూపాయికే అంత్యక్రియల కార్యక్రమాన్ని అమలు చేస్తున్న ఆయన తాజాగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రూపాయికే రక్తం, మూత్రం, బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రోగులపై ఎటువంటి భారం పడకూదని సూచించారు. ఇందుకోసం అవసరమైన పరికరాలు కొనుగోలు, ప్రయోగశాల కోసం రూ.25 లక్షలు మంజూరు చేశారు. నగరపాలక ఆరోగ్యం కేంద్రంలో సదుపాయాలు, వైద్యుని నియామకం విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెడతామని తెలిపారు. టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సూచన మేరకు తానీ సంక్షేమ పథకాలకు తెరలేపినట్లు చెప్పుకొచ్చారు. పేదల కోసం బూట్ హౌస్ (చెప్పు కేంద్రం) కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పనికిరాని చెప్పులను ఆ కేంద్రంలో ఇస్తే వాటిని పేదలకు అందజేస్తారని తెలిపారు.