Bhupesh Bhagel: పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ భోరున విలపించిన ఛత్తీస్గఢ్ సీఎం
- 2013లో పీసీసీ అధ్యక్షుడిగా రాహుల్ నియమించారు
- 2014లో పార్టీ ఓడిపోతుందేమోనని భయపడ్డారు
- పార్టీ అధికారంలోకి రావడంతో మనోస్థైర్యం పెరిగింది
కాంగ్రెస్ పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది. నేడు పీసీసీ అధ్యక్ష పదవికి ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ భాఘేల్ రాజీనామా చేశారు. అయితే ఆ సమయంలో ఆయన బాధను భరించలేక భోరున విలపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2013లో తనను అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ నియమించారని వెల్లడించారు.
2014లో పార్టీ ఓడిపోతుందేమోనని కార్యకర్తలు, నేతలు భయపడ్డారని, కానీ పార్టీ అధికారంలోకి రావడంతో వారిలో మనోస్థైర్యం పెరిగిందన్నారు. తనతో పాటు ఐదేళ్లుగా కలిసి పని చేస్తున్న కార్యకర్తలకు, నేతలకు భూపేశ్ భాగేల్ ధన్యవాదాలు తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా కొత్తగా ఎన్నికైన మోహన్ మార్కమ్ చాలా సాధారణ జీవితాన్ని గడుపుతారని, ఆయనలో కష్టించే తత్వం ఎక్కువని భూపేశ్ భాగేల్ ప్రశంసించారు.