Gas: ఏకంగా రూ. 100కు పైగా తగ్గిన సబ్సిడీ రహిత గ్యాస్ సిలిండర్ ధర
- నేటి నుంచి తగ్గింపు ధరలు అమలులోకి
- సబ్సిడీ సహిత సిలిండర్ ధర కూడా తగ్గే సూచన
- ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడాయిల్, గ్యాస్ ధరలు తగ్గుదల
ఇండియాలో సబ్సిడీరహిత వంట గ్యాస్ సిలిండర్లను వాడుతున్న వినియోగదారులకు ఐవోసీ (ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్) శుభవార్త చెప్పింది. సబ్సిడీలేని సిలిండర్ ధరను రూ. 100.50 తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. ఈ ధరలు సోమవారం నుంచి అమలులోకి వస్తాయని ప్రకటించింది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడాయిల్, గ్యాస్ ధరలు తగ్గడంతో పాటు, డాలర్ తో రూపాయి మారకం విలువ బలపడడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. ప్రస్తుతం సబ్సిడీలేని సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 737.50గా ఉండగా, అది రూ. 637కు తగ్గనుంది. ప్రస్తుతం సబ్సిడీపై అందిస్తున్న సిలిండర్ ధర రూ. 494.35గా ఉండగా, దాని ధర కూడా నేడో, రేపో తగ్గుతుందని అంచనా.