Mumbai: భారీ వర్షాలకు ముంబయి ఎయిర్ పోర్టులో చేపలు ప్రత్యక్షం!

  • లోతట్టున ఉన్న ఎయిర్ పోర్టు ప్రాంతం
  • భారీ వర్షాలకు పొంగిన సమీపంలో ఉన్న సరస్సు
  • ఎయిర్ పోర్టు నీటిలోకి చేపలు ప్రవేశం

నైరుతి రుతుపవనాల సీజన్ లో ముంబయిలో భారీ వర్షాలు కురుస్తుంటాయి. ఈసారి నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా వచ్చినా ముంబయిలో గణనీయమైన స్థాయిలో ప్రభావం చూపిస్తున్నాయి. గత కొన్నిరోజులుగా ముంబయి నగరం ఎడతెరిపిలేని వర్షాలతో తడిసి ముద్దవుతోంది. ఈ నేపథ్యంలో, ముంబయి విమానాశ్రయం జలమయం కాగా, ఆ నీటిలో పెద్ద పెద్ద చేపలు దర్శనమిస్తున్నాయి.

ముంబయి ఎయిర్ పోర్టు మిగతా ప్రాంతాలతో పోలిస్తే కాస్త లోతట్టు ప్రాంతమేనని, వర్షా కాలంలో ఇక్కడికి సమీపంలో ఉన్న సరస్సు పొంగి అందులో ఉన్న చేపలు కొట్టుకువస్తుంటాయని ఓ సీనియర్ పైలెట్ వివరించారు. అయితే, అలా వచ్చిన చేపల్లో అత్యధికం క్యాట్ ఫిష్ లే కావడంతో ఎవరూ పట్టుకునేందుకు ఆసక్తిచూపడంలేదు. క్యాట్ ఫిష్ లు తింటే అనారోగ్యం అనే ప్రచారం ఉండడంతో వాటిని వీడియో తీశారే తప్ప ఎవరూ పట్టుకోలేదు.

  • Loading...

More Telugu News