Kaleswaram: ‘కాళేశ్వరం’పై సీబీఐ విచారణ చేపట్టాలని ప్రధానిని కోరతాం: బీజేపీ నేత రఘునందన్ రావు
- సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాసిన రఘునందన్
- ‘కాళేశ్వరం’ నిర్మాణంలో భారీ అవినీతి చోటుచేసుకుంది
- కేసీఆర్ ఈ ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు రావాలి
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి చోటుచేసుకుందని, దీనిపై సీబీఐ విచారణ చేపట్టాలని ప్రధాని మోదీని కోరతామని బీజేపీ నేత రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు ఆయన బహిరంగ లేఖ రాశారు. ఈరోజు నుంచి పంప్ హౌస్ లు పనిచేస్తాయని కేసీఆర్ ప్రకటించారు కానీ, కన్నెపల్లి వద్ద పంప్ హౌస్ ఒక్కటీ పనిచేయడం లేదని అన్నారు. అక్కడ పదకొండు పంపులు పని చేస్తున్నాయని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారని, అవి పని చేస్తుంటే గోదావరి నీటిని ఎందుకు ఎత్తిపోయడం లేదు? అని ప్రశ్నించారు. సుందిళ్ల, అన్నారం పంపుహౌస్ పనుల్లో భారీ అవినీతి చోటుచేసుకుందని ఆరోపించిన రఘునందన్, ఈ ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు రావాలని కేసీఆర్ ను డిమాండ్ చేశారు.