Prakash Javadekar: అటవీశాఖ అధికారులపై దాడి ఘటనను ఉపేక్షించేది లేదు: కేంద్రం
- దాడి ఘటనపై స్పందించిన ప్రకాశ్ జవదేకర్
- దాడి ఘటనను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం
- నిందితులపై ఎలాంటి చర్యలకైనా సిద్ధం
అటవీశాఖ అధికారులపై నిన్న తెలంగాణలో జరిగిన దాడిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. తెలంగాణలోని కాగజ్‌నగర్‌లో నిన్న హరితహారం నిర్వహించేందుకు వెళ్లిన అటవీశాఖాధికారులపై టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కృష్ణారావు తన అనుచరులతో దాడి చేశారు. ఈ ఘటనలో అటవీ రేంజ్ అధికారి అనిత తీవ్రంగా గాయపడ్డారు.
నేడు రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ ఘటన గురించి ప్రస్తావించారు. అటవీశాఖ అధికారులపై దాడి ఘటనను ఉపేక్షించేది లేదని, దీనిని చాలా తీవ్రమైన విషయంగా పరిగణిస్తున్నామని అన్నారు. ఇలాంటి ఘటనలను నియంత్రించేందుకు నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా సిద్ధమన్నారు.