Jagan: అక్షయపాత్ర ద్వారా విద్యార్థులకు అందిస్తున్న భోజనాలను ఆపేయండి: సీపీఎం మధు
- కనీస వేతన చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలి
- కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని పర్మినెంట్ చేయాలి
- రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి
అక్షయ పాత్ర ద్వారా విద్యార్థులకు అందజేస్తున్న భోజనాలను నిలిపివేయాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు కోరారు. నేడు జగన్తో సీపీఎం నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీపీఎం నేతలు జగన్కు కొన్ని విజ్ఞాపనలు చేశారు. కనీస వేతన చట్టాన్ని సక్రమంగా అమలు చేయడం ద్వారా 45 లక్షల మంది అసంఘటిత కార్మికులకు మేలు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని పర్మినెంట్ చేయాలని, అంగన్వాడీ, ప్రతిపక్షాలు, రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తి వేయాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.