Andhra Pradesh: నేను పార్టీ స్థాపించినప్పుడు నాతో తొలి అడుగులు వేసిన వ్యక్తి సోమయాజులు: సీఎం జగన్

  • డీఏ సోమయాజులు 67వ జయంతి
  • ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న వైఎస్ జగన్
  • సోమయాజులు ఒక లివింగ్ ఎన్ సైక్లోపీడియా

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారుగా పని చేసిన డీఏ సోమయాజులు 67వ జయంతిని పురస్కరించుకుని విజయవాడలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వైఎస్ జగన్ హాజరయ్యారు. సోమయాజులు చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, సోమయాజులు ఒక లివింగ్ ఎన్ సైక్లోపీడియా అని కొనియాడారు. ప్రతి విషయంపై ఆయనకు అవగాహన ఉండేదని అన్నారు.

పలు అంశాలపై తమకు ఆయన క్లాసులు చెప్పేవారని గుర్తుచేసుకున్న జగన్, తనకు గురువు అని చెప్పారు. సొంతగా పార్టీ పెట్టినప్పుడు తనతో పాటు మొట్టమొదట అడుగులు వేసిన వ్యక్తి సోమయాజులు అని, ఆయన ఒక గురువుగా తనకు ప్రతి విషయంలో సలహాలు, సూచనలు ఇచ్చేవారని అన్నారు. 2014లో తొలిసారి తాను అసెంబ్లీలో అడుగు పెట్టినప్పుడు తన ప్రతి ప్రసంగం వెనుక ఆయన పాత్ర ఉందని గర్వంగా చెబుతున్నానని చెప్పారు. ఈ సందర్భంగా తన ప్రత్యేక కార్యదర్శి, సోమయాజులు కుమారుడు కృష్ణ గురించి జగన్ ప్రస్తావించారు. కృష్ణకు కూడా అన్ని విషయాలపై అవగాహన ఉందని, తండ్రిని మించిన తనయుడిగా ఆయన ఎదుగుతాడని ఆకాంక్షించారు.

  • Loading...

More Telugu News