Social Media: సీఎం జగన్పై అసభ్యకర పోస్టులు పెట్టిన దాసరి కిరణ్ అరెస్ట్
- ఎమ్మెల్యే కేతిరెడ్డిపైనా అనుచిత పోస్టులు
- సోషల్ మీడియా విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక
- రెచ్చగొట్టే పోస్టులు పెడితే మూల్యం చెల్లించకతప్పదన్న డీఎస్పీ
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిలపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన దాసరి కిరణ్ అనే వ్యక్తిని తాడిపత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు డీఎస్పీ జయరామసుబ్బారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియాను చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని సూచించారు. గిట్టని వారిపై అనుచిత పోస్టులు తగవన్నారు. రెచ్చగొట్టే పోస్టులు పెడితే అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని డీఎస్పీ హెచ్చరించారు.