Chandrababu: కోటేశ్వరమ్మ జీవితం ఎందరికో ఆదర్శవంతం: చంద్రబాబు
- కోటేశ్వరమ్మ మరణం విద్యా వ్యవస్థకు తీరని లోటు
- సామాన్య కుటుంబంలో జన్మించి ఉన్నత స్థాయికి ఎదిగారు
- ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి
మాంటిస్సోరి విద్యాసంస్థల స్థాపకురాలు కొటేశ్వరమ్మగారి మృతి విద్యా వ్యవస్థకు తీరనిలోటని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. సామాన్య కుటుంబంలో జన్మించి, ఉన్నత స్థాయికి ఎదిగిన ఆమె జీవితం ఎందరికో ఆదర్శమని చెప్పారు. మహిళాభ్యున్నతికై పాటుపడిన గొప్పవ్యక్తి, మానవతావాది కొటేశ్వరమ్మగారి ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నానని తెలిపారు. ఈమేరకు ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు.
మాంటిస్సోరి విద్యాసంస్థల వ్యవస్థాపకురాలు కోటేశ్వరమ్మ (95) అనారోగ్యం కారణంగా ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. 1955లో కేవలం 20 మంది పిల్లలతో తొలి పాఠశాలను ప్రారంభించిన ఆమె... దశలవారీగా పలు విద్యాసంస్థలను ఏర్పాటు చేసి, లక్షలాది మందికి విద్యాదానం చేశారు.
మాంటిస్సోరి విద్యాసంస్థల స్థాపకురాలు కొటేశ్వరమ్మగారి మృతి విద్యా వ్యవస్థకు తీరనిలోటు. సామాన్య కుటుంబంలో జన్మించి ఉన్నతస్థాయికి ఎదిగిన ఆమె జీవితం ఎందరికో ఆదర్శం. మహిళాభ్యున్నతికై పాటుపడిన గొప్పవ్యక్తి, మానవతావాది కొటేశ్వరమ్మగారి ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను pic.twitter.com/Wwp5U8DjV6
— N Chandrababu Naidu (@ncbn) July 2, 2019