Nellore: ఏపీలో విత్తనాల కొరత.. అవే పరిస్థితులు పునరావృతమయ్యాయి: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

  • కాంగ్రెస్ హయాంలో విత్తనాల కొరత ఉండేది
  • ఏపీలో ఇప్పుడు అవే పరిస్థితులు ఉన్నాయి
  • ఈ ఏడాది ఫిబ్రవరి నాటికే  విత్తనాలను సిద్ధం చేశాం
  • ‘కోడ్’ వచ్చాక అనధికారికంగా వైసీపీ పెత్తనం చేసింది

ఏపీలో విత్తనాల కొరతపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. నెల్లూరులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ హయాంలో విత్తనాల కోసం రైతులు ఎన్నో ఇబ్బందులు పడేవారని, అవే పరిస్థితులు ఇప్పుడు పునరావృతం అవుతున్నాయని విమర్శించారు. టీడీపీ హయాంలో రైతులకు విత్తనాల కొరత లేకుండా చూశామని అన్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరి నాటికే అన్ని రకాల విత్తనాలను డెబ్బై శాతం సిద్ధం చేశామని, ఎన్నికల కోడ్ వచ్చాక అనధికారికంగా వైసీపీ పెత్తనం చేసిందని ఆరోపించారు. సీఎస్ నుంచి ఐఏఎస్, ఐపీఎస్ ల వరకూ బదిలీలు చేయించారని, అధికారులతో సమీక్షలు నిర్వహించేందుకూ ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. రైతులకు విత్తనాలు అందించలేని వైసీపీ ప్రభుత్వం తమపై నిందలు వేయడం దురదృష్టకరమని అన్నారు. ఇప్పటికైనా విత్తనాలు సిద్ధం చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News