sensex: వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో మార్కెట్లలో సానుకూలత
  • 69 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 30 పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. రేపు కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనుండటంతో మార్కెట్లు సానుకూలంగా ట్రేడ్ అయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 69 పాయింట్లు లాభపడి 39,908కి పెరిగింది. నిఫ్టీ 30 పాయింట్లు పుంజుకుని 11,945 వద్ద స్థిరపడింది.
 
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్ (2.53%), టాటా మోటార్స్ (1.76%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.61%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (1.45%), హీరో మోటో కార్ప్ (0.62%).

టాప్ లూజర్స్:
యస్ బ్యాంక్ (-3.56%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.15%), వేదాంత (-1.04%), సన్ ఫార్మా (-0.90%), టాటా స్టీల్ (-0.43%).          

  • Loading...

More Telugu News