Hema Malini: వైద్యులపై దాడుల పట్ల ఆవేదన వ్యక్తం చేసిన హేమమాలిని

  • నిగ్రహం కోల్పోయి దాడులు చేస్తున్నారు
  • దాడుల నియంత్రణకు పటిష్ఠమైన చట్టం తేవాలి
  • వైద్యుల కొరతను నివారించాలి

వైద్యులు దైవ సమానులని, వారికి కుల, మతాల పట్టింపులుండవని, వారి దృష్టిలో అంతా సమానమేనని ఎంపీ హేమమాలిని పేర్కొన్నారు. నేడు లోక్‌సభలో జీరో అవర్‌లో ఆమె మాట్లాడుతూ, వైద్యులపై జరుగుతున్న సామూహిక దాడులను నియంత్రించేందుకు పటిష్ఠమైన చట్టం తేవాలన్నారు.

కొందరు నిగ్రహం కోల్పోయిన బాధిత కుటుంబ సభ్యులు వైద్యులపై దాడికి పాల్పడటం పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హేమమాలిని, పశ్చిమ బెంగాల్‌లో వైద్యుల సమ్మెతో పాటు మధురలో ఇటీవల వైద్యులపై జరిగిన దాడి అంశాలను ప్రస్తావించారు. ప్రభుత్వం వైద్యులకు సరైన రక్షణ కల్పించాలన్నారు. వైద్యుల కొరత అంశాన్ని హేమమాలిని ప్రస్తావించారు.

  • Loading...

More Telugu News