Nirmala Seetharaman: 1.97 కోట్ల ఇళ్లను నిర్మించబోతున్నాం: నిర్మలా సీతారామన్
- ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణాలు
- 114 రోజుల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి
- 1.25 లక్షల కిలోమీటర్ల రోడ్లను నిర్మిస్తాం
2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె పలు ప్రజాకర్షక ప్రకటనలు చేశారు. ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద కొత్తగా 1.97 కోట్ల ఇళ్లను నిర్మించబోతున్నామని ప్రకటించారు. 114 రోజుల్లో ఈ నిర్మాణాలు పూర్తవుతాయని చెప్పారు. ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇళ్లను నిర్మిస్తామని తెలిపారు. ఇదే పథకం కింద రూ. 80,250 కోట్ల బడ్జెట్ తో రోడ్ల నిర్మాణాలను చేపడతామని... గ్రామాల అనుసంధానం కోసం 1.25 లక్షల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని నిర్ణయించామని చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు ప్రతి సంవత్సరం రూ. 20 లక్షల కోట్లు మంజూరు చేస్తామని తెలిపారు.