India: ఇకపై ఎన్నారైలకు సత్వరమే ఆధార్ కార్డులు.. కొత్తగా నాలుగు ఎంబసీల ఏర్పాటు!: నిర్మలా సీతారామన్

  • 2019-20 బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి
  • అంధులు కూడా గుర్తించేలా రూ.1, 2, 5, 10, 20 నాణేలు
  • ఎయిరిండియాలో పెట్టుబడుల ఉపసంహరణ

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఉద్దేశించిన బడ్జెట్ ను ఈ రోజు పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పలు రంగాలకు సంబంధించిన కీలక పథకాలను ఆమె ప్రకటించారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలకు తాము ప్రాధాన్యత ఇస్తున్నామనీ, వాటికి వన్ టైమ్ క్రెడిట్ గ్యారెంటీ ఇస్తున్నామని వెల్లడించారు. మెట్రో రైలు ప్రాజెక్టుల్లో ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఎల్ఈడీ బల్బులతో రూ.18,341 కోట్లు ఆదా అయ్యాయని చెప్పారు. విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని సీతారామన్ పేర్కొన్నారు.

ఈ బడ్జెట్ హైలైట్స్..
  • ఎన్నారైలు 180 రోజులు ఎదురుచూడకుండా సత్వరమే ఆధార్ కార్డుల జారీ
  • 2019-20 ఆర్థిక సంవత్సరానికి నాలుగు కొత్త ఎంబసీల ఏర్పాటు
  • దేశవ్యాప్తంగా 17 ఐకానిక్ టూరిజం ప్రాంతాల అభివృద్ధి
  • మౌలిక రంగం అభివృద్ధి కోసం ‘ఐడియాస్ పథకం’ ప్రారంభం
  • విద్యుత్ వాహనాల వినియోగం ప్రోత్సహానికి రూ.10,000 కోట్లు మంజూరు
  • బ్యాంకింగ్ లో రూ.లక్ష కోట్ల మేర తగ్గిన నిరర్ధక ఆస్తులు(ఎన్ పీఏ)
  • నాలుగేళ్లలో రూ.4 లక్షల కోట్ల ఎన్ పీఏలు వసూలు చేశాం
  • ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.70,000 కోట్ల సాయం..బ్యాంకింగ్ రంగంలో ప్రక్షాళన
  • ఎయిరిండియాలో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు నిర్ణయం
  • మహాత్మాగాంధీపై సమగ్ర సమాచారం కోసం ‘గాంధీపీడియా’ను అక్టోబర్ 2న ఆవిష్కరిస్తాం
  • మహిళా నాయకత్వంలో సాగే పరిశ్రమలను ప్రోత్సహిస్తాం
  • దేశంలో పరిశోధన ప్రోత్సాహానికి నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్(ఎన్ఆర్ఎఫ్) ఏర్పాటు
  • త్వరలో రూ.1, 2, 5,10, 20 కొత్త నాణేల విడుదల.. వీటిని దివ్యాంగులు(అంధులు) కూడా గుర్తించేలా ముద్రణ

  • Loading...

More Telugu News