Telangana: తెలంగాణ లో ఇంజనీరింగ్ కళాశాలల ఫీజుల ఖరారు
- మూడేళ్లపాటు అమలులో ఉండనున్న ఫీజులు
- ఇంజనీరింగ్ కళాశాలల్లో కనీస రుసుం రూ.35 వేలు
- అత్యధికంగా సీబీఐటీకు రూ.1.34 లక్షలు
రేపటి నుంచి తెలంగాణలో ఎంసెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ ఫీజులను ఖరారు చేస్తూ జీవో జారీ అయింది. ఈ ఇంజనీరింగ్ ఫీజులు మూడేళ్లపాటు అమలులో ఉండనున్నాయి. 103 ఇంజనీరింగ్ కళాశాలకు పూర్తి స్థాయి రుసుంలు, 88 కళాశాలలకు తాత్కాలిక రుసుంలు ఖరారు చేశారు. రాష్ట్రంలో 22 కళాశాలల్లో లక్షకు పైగా ఫీజులను నిర్ణయించారు. ఇంజనీరింగ్ కళాశాలల్లో కనీస రుసుం రూ.35 వేలు కాగా, అత్యధికంగా చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ (సీబీఐటీ)కు రూ.1.34 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది.