MS Dhoni: తన రిటైర్ మెంట్ పై కీలక వ్యాఖ్యలు చేసిన ఎంఎస్ ధోనీ!
- ఇప్పటికే ఆటకు వీడ్కోలు పలికిన పలువురు ఆటగాళ్లు
- నేను ఎప్పుడు రిటైర్ అవుతానో నాకే తెలియదు
- కానీ కొందరు మాత్రం కోరుకుంటున్నారన్న ధోనీ
బ్రిటన్ లో జరుగుతున్న వరల్డ్ కప్ పోటీలే తమకు చివరి పోటీలని పలువురు ఆటగాళ్లు ఇప్పటికే రిటైర్ మెంట్ ప్రకటించారు. భారత మిడిలార్డర్ ఆటగాడు అంబటి రాయుడు, పాక్ సీనియర్ ఆటగాడు షోయబ్ మాలిక్, దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్, వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ తదితరులు ఆటకు విరమణ ప్రకటించేశారు కూడా. ఇదే టోర్నీలో తన నిదానపు ఆటతీరుతో విమర్శలు ఎదుర్కొంటున్న ధోనీ సైతం వీడ్కోలు పలకనున్నాడని వార్తలు రాగా, ధోనీ వాటిని ఖండించాడు. వ
రల్డ్ కప్ క్రికెట్ టోర్నీ అనంతరం, రిటైర్ మెంట్ చెబుతానని వస్తున్న వార్తలు గాలి వార్తలేనని స్పష్టం చేశాడు. ఏబీపీ న్యూస్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, తన వీడ్కోలు గురించి తనకే తెలియదని పేర్కొన్నాడు. తానెప్పుడు రిటైర్ అవుతానో చెప్పలేనని, కానీ చాలా మంది తాను శ్రీలంకతో మ్యాచ్ కి ముందే రిటైర్ మెంట్ ప్రకటించాలని కోరుకుంటున్నారని కీలక వ్యాఖ్యలు చేశాడు. కాగా, వరల్డ్ కప్ తరువాత కూడా ధోనీ జట్టులో ఉంటాడని బీసీసీఐ అధికారి ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం.