KL Rahul: వరల్డ్ కప్ లో తొలి సెంచరీ సాధించిన కేఎల్ రాహుల్
- అద్భుతంగా ఆడిన రాహుల్
- కెరీర్ లో రెండో శతకం
- విజయానికి చేరువలో టీమిండియా
ఎంతో ప్రతిభావంతుడిగా పేరుపొందినా, వరుస వైఫల్యాలతో సతమతమైన కేఎల్ రాహుల్ కు ఈ వరల్డ్ కప్ ఓ తీపి జ్ఞాపకం అనడంలో అతిశయోక్తిలేదు. శిఖర్ ధావన్ గాయపడడంతో ఓపెనర్ గా ప్రమోషన్ పొందిన ఈ కర్ణాటక యువ ఆటగాడు అందివచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు. తాజాగా, శ్రీలంకతో మ్యాచ్ లో తన ఫామ్ ను పతాకస్థాయికి తీసుకెళ్లిన రాహుల్ శతకంతో మెరిశాడు. 39వ ఓవర్లో మలింగ బంతిని సింగిల్ తరలించడం ద్వారా రాహుల్ కెరీర్ లో రెండో సెంచరీ సాధించాడు. అంతేకాకుండా వరల్డ్ కప్ లో మొదటి సెంచరీని కూడా ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం టీమిండియా రోహిత్ 40 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 234 పరుగులు చేసింది. భారత్ విజయానికి 60 బంతుల్లో 31 పరుగులు చేయాలి. క్రీజులో రాహుల్, కెప్టెన్ కోహ్లీ ఉన్నారు.