My Home: ఐటీ అధికారులు కోరిన పూర్తి సమాచారాన్ని అందించాం: మై హోమ్ గ్రూప్
- బెంగళూరుకు చెందిన సంస్థతో మాకు జాయింట్ వెంచర్ ఉంది
- ఈ సంస్థపై జరిగిన దాడుల్లో భాగంగానే మాపై దాడులు
- అధికారులు అడిగిన సమాచారాన్ని ఇచ్చాం
మై హోమ్ గ్రూపు సంస్థపై గత రెండు రోజులుగా ఐటీ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ దాడులపై ఆ సంస్థ స్పందించింది. ఈ దాడులు నేరుగా తమ సంస్థపై జరగలేదని తెలిపింది. బెంగళూరుకు చెందిన ఓ కంపెనీపై జరిగిన దాడుల్లో భాగంగానే తమపై కూడా దాడులు జరిగాయని చెప్పింది. హైదరాబాదులో బెంగళూరుకు చెందిన ఆ సంస్థతో తమకు జాయింట్ వెంచర్ ఉందని... ఈ కారణంగానే తమపై దాడులు జరిగాయని తెలిపింది. ఐటీ అధికారులు కోరిన సమాచారాన్ని అందజేశామని చెప్పింది. తాము విలువలతో కూడిన వ్యాపారాన్ని నిర్వహిస్తామని, నియమనిబంధనలను పూర్తి స్థాయిలో పాటిస్తామని తెలిపింది. తమ సంస్థకు మంచి ట్రాక్ రికార్డ్ ఉందని చెప్పింది.