Amazon: జెఫ్ బెజోస్ విడాకుల కేసు కొలిక్కి.. అమెజాన్ నుంచి మెకన్జీకి 38.3 బిలియన్ డాలర్ల విలువైన షేర్లు!
- విడిపోతున్నట్టు జనవరిలో ప్రకటించిన జెఫ్ బెజోస్-మెకన్జీ
- అమెజాన్‌లో నాలుగు శాతం వాటాను దక్కించుకున్న మెకన్జీ
- ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలైన మహిళగా గుర్తింపు
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, ఆయన భార్య మెకన్జీ బెజోస్‌ల వివాహం జీవితం ఇక ముగిసిన అధ్యాయం. వారి విడాకుల వ్యహారానికి సియాటెల్ న్యాయమూర్తి శుక్రవారం ముగింపు ఇచ్చారు. ఆయన తీర్పు ప్రకారం.. విడాకుల సెటిల్మెంట్లో భాగంగా అమెజాన్‌లోని నాలుగు శాతం వాటా మెకన్జీకి లభించనుంది. ఈ వాటా విలువ 38.3 బిలియన్ డాలర్లు. ఈ వాటాతో మెకన్జీ అత్యంత ధనవంతురాలైన మూడో మహిళగా రికార్డులకెక్కనుంది. కాగా, బెజోస్ 114.8 బిలియన్ డాలర్ల విలువైన 12 శాతం వాటాతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన వ్యక్తిగా కొనసాగుతున్నాడు.
తామిద్దరం విడిపోతున్నట్టు ఈ ఏడాది జనవరిలో జెఫ్ బెజోస్-మెకన్జీ బెజోస్‌లు ప్రకటించారు. విడాకులకు కోర్టు అనుమతి ఇచ్చాక ఏప్రిల్‌లోనే మెకన్జీ పేరుపై అమెజాన్‌లోని నాలుగు శాతం వాటా (19.7 మిలియన్ షేర్లు)ను రిజిస్టర్ చేశారు.